Skip to main content

Posts

Showing posts from July, 2016

దౌడెపల్లిలో ఘనంగా ఊరంపుడు కార్యక్రమం

జులై-3-2016 నాడు మన దౌడపల్లిలో ఊరంపుడు కార్యక్రమం మస్త్ జోరుగా జరిగింది. ముందు రోజు రాత్రి నుంచే పోచమ్మకు పూజలు మొదలై తర్వాతి రోజు మధ్యాహ్నం వరకు కొనసాగి మేక పిల్ల గావు పట్టుడంతో ముగిసింది. పంబాలొళ్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజకు ఊళ్లోని అన్ని కులాలు హాజరై పోచమ్మ ఆశీర్వాదం పొందారు. పోచమ్మ కిందకు చేరిన మన దౌడెపల్లి ప్రజలు భక్తి శ్రద్ధలతో గ్రామమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. అసలు ‪#‎ఊరంపుడు‬ ఎందుకు?? ఊరంపుడు వెనుక చాలా పెద్ద కథే ఉంది. పదేళ్లకొకసారి ఊరంపితే దుష్టశక్తుల్ని బయటకు తరుమొచ్చన్నది దానివెనుకున్న ప్రధాన ఉద్దేశం. ముందుగా పోచమ్మ విగ్రహాన్ని ఊరు నడిబొడ్డున ఉంచి పూజలు చేస్తారు. ఆతర్వాత ఉదయాన్నే చాకలి కులస్తులతో అందరూ బయల్దేరి దుష్ట శక్తుల జాడని గుర్తించి వాటిిని బంధిస్తారు.ఆతర్వాత ఊరి చివర్లో వాటిని వదిలేస్తారు. .  మన కంటే ముందు వెంకట్రావుపేట ఊరు ఊరంపి ఆ పీడను ఊరి బయట వదిలేస్తే అది మనకొచ్చి సుట్టుకుంటది దాన్ని మనం ఇంకో ఊరు మీద అటునుంచి ఇంకో ఊరు ఇలా సాగుతుంది. ఊరంపుడు కార్యక్రమం.. అసలు ‪#‎ఊరంపుడు‬ ఎందుకు?? ఊరంప