Skip to main content

Posts

Showing posts from 2016

DOWDEPALLY BATHUKAMMA-2016

DOWDEPALLY BATHUKAMMA SAMBARALU-216

దౌడెపల్లిలో ఘనంగా ఊరంపుడు కార్యక్రమం

జులై-3-2016 నాడు మన దౌడపల్లిలో ఊరంపుడు కార్యక్రమం మస్త్ జోరుగా జరిగింది. ముందు రోజు రాత్రి నుంచే పోచమ్మకు పూజలు మొదలై తర్వాతి రోజు మధ్యాహ్నం వరకు కొనసాగి మేక పిల్ల గావు పట్టుడంతో ముగిసింది. పంబాలొళ్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజకు ఊళ్లోని అన్ని కులాలు హాజరై పోచమ్మ ఆశీర్వాదం పొందారు. పోచమ్మ కిందకు చేరిన మన దౌడెపల్లి ప్రజలు భక్తి శ్రద్ధలతో గ్రామమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. అసలు ‪#‎ఊరంపుడు‬ ఎందుకు?? ఊరంపుడు వెనుక చాలా పెద్ద కథే ఉంది. పదేళ్లకొకసారి ఊరంపితే దుష్టశక్తుల్ని బయటకు తరుమొచ్చన్నది దానివెనుకున్న ప్రధాన ఉద్దేశం. ముందుగా పోచమ్మ విగ్రహాన్ని ఊరు నడిబొడ్డున ఉంచి పూజలు చేస్తారు. ఆతర్వాత ఉదయాన్నే చాకలి కులస్తులతో అందరూ బయల్దేరి దుష్ట శక్తుల జాడని గుర్తించి వాటిిని బంధిస్తారు.ఆతర్వాత ఊరి చివర్లో వాటిని వదిలేస్తారు. .  మన కంటే ముందు వెంకట్రావుపేట ఊరు ఊరంపి ఆ పీడను ఊరి బయట వదిలేస్తే అది మనకొచ్చి సుట్టుకుంటది దాన్ని మనం ఇంకో ఊరు మీద అటునుంచి ఇంకో ఊరు ఇలా సాగుతుంది. ఊరంపుడు కార్యక్రమం.. అసలు ‪#‎ఊరంపుడు‬ ఎందుకు?? ఊరంప

దౌడెపల్లి జనాభా వివరాలు

దౌడెపల్లి గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1740 మంది అందులో పురుషులు- 843 మంది, స్త్రీలు-897 మంది ఆరేళ్లలోపు వయసున్న చిన్నారుల సంఖ్య-134 రాష్ట్రంలోని స్త్రీ పురుష నిష్పత్తి 993 ఉండగా దౌడెపల్లిలో అది 1064 ఉంది. ఇక అక్షరాస్యత విషయానికొస్తే ప్రతి వంద మందిలో 62 మందే ఇక్కడ చదువుకున్న వారు. పురుషుల్లో 72 శాతం మంది స్త్రీల్లో 52 శాతం మందే చదువుకున్నా వాళ్లు... ఇప్పటికైనా స్త్రీ విద్య అవశ్యకతను గుర్తించి గ్రామంలో బాలికల్ని చదివించేలా ప్రోత్సహించాల్సిన అవసరముంది.

POLITICS OF DOWDEPALLY

దౌడెపల్లికి రాజకీయంగా ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉండేది. 1990 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడేే వరకు తెలుగుదేశం బలంగా ఉండేది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, తెలంగాణ ఉద్యమంలో భాగంగా దౌడెపల్లి ప్రజలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు.ప్రధాన నాయకులు తెలుగుదేశంలోనే కొనసాగినప్పటికి ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టారు.లక్సెట్టిపేట మండలంలో ఉన్న ఏకైక ఆంధ్రాబ్యాంకు శాఖను దౌడెపల్లి నుంచి తరలించినా నాయకులు మాత్రం పట్టించుకోలేదు. అంబేద్కర్ యువజన సంఘం పదిహేను సంవత్సరాలు ప్రభావం చూపించినా తర్వాత తగ్గిపోయింది. ప్రస్తుతం మాత్రం యువకులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పొచ్చు... మరిన్ని సంగతులు త్వరలో....