దౌడెపల్లికి రాజకీయంగా ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉండేది. 1990 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడేే వరకు తెలుగుదేశం బలంగా ఉండేది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, తెలంగాణ ఉద్యమంలో భాగంగా దౌడెపల్లి ప్రజలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు.ప్రధాన నాయకులు తెలుగుదేశంలోనే కొనసాగినప్పటికి ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టారు.లక్సెట్టిపేట మండలంలో ఉన్న ఏకైక ఆంధ్రాబ్యాంకు శాఖను దౌడెపల్లి నుంచి తరలించినా నాయకులు మాత్రం పట్టించుకోలేదు. అంబేద్కర్ యువజన సంఘం పదిహేను సంవత్సరాలు ప్రభావం చూపించినా తర్వాత తగ్గిపోయింది. ప్రస్తుతం మాత్రం యువకులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పొచ్చు... మరిన్ని సంగతులు త్వరలో....
దౌడేపల్లి ఊరు లక్షెట్టిపేట మండలంలో ఉంది. ఓవైపు వందల ఎకరాలకు నీళ్లిచ్చే చెరువు మరో వైపు కడెం కెనాల్ మధ్యలో ఉంటుంది..
Comments
Post a Comment